మెగా హీరో కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ దిశా పఠానీ. వరుణ్‌తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాతో టాలీవుడ్‌లో సెటిలవ్వచ్చని కలలుగన్న ఈ భామకు ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేదు. దాంతో ఈ భామకు తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. ప్రయత్నాలు మాత్రం సాగిస్తూనే వుంది. తాజాగా జాకీచాన్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ భామకు మెగా హీరో అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటించాలని కోరిక వుందట.
హీరోయిన్‌గా కాకపోయినా కనీసం ఆ సినిమాలో ఐటమ్‌సాంగ్‌లో అయినా నటించాలని ఉందని చెబుతోంది. అల్లు అర్జున్ సినిమాలో చేస్తే కనీసం సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కాకుండా క్రేజీ హీరోయిన్‌గా మారవచ్చని ఆలోచనలో వుంది ఈ భామ. మొత్తానికి ఈమె కోరిక అల్లు అల్జున్ తీరుస్తాడో లేదో చూడాలి!