నేడే మహానటి టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మహానటి’. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రియాంక దత్ నిర్మాత. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్ర బృందం రేపు (ఏప్రిల్ 14) ‘మహానటి’ మోషన్ పోస్టర్‌తోపాటు సినిమాలో కీర్తి సురేష్ ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన సమంత, విజయ్ దేవరకొండల ఫస్ట్‌లుక్స్, మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. పీరియాడిక్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ‘మహానటి’ సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్ర రాజం. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని టెక్నికల్‌గా హైస్టాండర్డ్స్‌తో తెరకెక్కిస్తున్నాడు. ఎస్.వి.రంగారావుగా మోహన్‌బాబు స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దుల్కర్ సల్మాన్, షాలిని పాండే, రాజేంద్రప్రసాద్, మాళివికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ‘మహానటి’ చిత్రం మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవ్వనున్నది. ఈ చిత్రానికి సంగీతం:మిక్కీ జె మేయర్, ఆర్ట్: అవినాష్, కాస్ట్యమ్స్: గౌరాంగ్, అర్చన, కెమెరా: డాని, కళానేతృత్వం: తోట తరణి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, దర్శకత్వం: నాగ్ అశ్విన్, నిర్మాత:ప్రియాంక దత్.