శ్రీరెడ్డిపై నిషేధం ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఫిలిం ఛాంబర్, డైరెక్టర్స్ అసోసియేషన్, మా అసోసియేషన్ పెద్దలు వర్థమాన నటి శ్రీరెడ్డి విషయాన్ని పునఃపరిశీలించమని సలహా ఇచ్చారని మా అధ్యక్షుడు శివాజీరాజా మీడియా సమావేశంలో తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించేవరకూ శ్రీరెడ్డితో ‘మా’ సభ్యులు యథాతథంగా పనిచేయవచ్చని శివాజీరాజా ప్రకటించారు. అలాగే ‘మా’లో సభ్యత్వ విషయమై కమిటీ సభ్యులు, మెంబర్లంతా సమావేశం ఏర్పాటుచేసుకుని నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇటీవల తెలుగు సినీ పరిశ్రమలో సెక్సువల్ హెరాస్‌మెంట్ జరుగుతోందన్న విమర్శల పరిణామాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో విశాఖ గైడ్ లైన్స్ పేరుతో ఇచ్చిన గైడ్‌లైన్స్ ఆధారంగా ఓ కమిటీని ఏర్పాటుచేయాలని, దీనిలో సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, ఫెడరేషన్ మెంబర్స్‌తోపాటు సమాజంలో ఉన్న అందరి ప్రముఖుల్ని (లాయర్లు, డాక్టర్లు, ప్రభుత్వాధికార్లు) ఇందులో మెంబర్స్‌గా ఉంటారని ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు పి.కిరణ్ తెలిపారు. గవర్నమెంట్ వారి గైడ్‌లైన్స్ ప్రకారం ప్రతి ప్రొడక్షన్ కంపెనీలో లైంగిక వేధింపుల నియంత్రణ కోసం ‘క్యాష్’ (కమిటీ అగెనెస్ట్ సెక్సువల్ హెరాస్‌మెంట్) ఉండి తీరాలని క్యాష్ కమిటీని ఏర్పాటుచేసేలా ఫిల్మ్ ఛాంబర్ బాధ్యత తీసుకుంటుందని ఛాంబర్ అధ్యక్షుడు పి.కిరణ్ తెలిపారు.