రెండో షెడ్యూల్‌కి చరణ్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రంగస్థలం’ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు రామ్‌చరణ్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల షేర్‌ను దాటిపోయింది. చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ఒక సినిమా చేస్తున్నారు. చరణ్ లేకుండానే ఒక షెడ్యూల్ పూర్తిచేసిన బోయపాటి మరో షెడ్యూల్‌ను ఈనెలాఖరు నుండి మొదలుపెడతారట. ఈ షూట్లో చరణ్ కూడ పాల్గొనబోతున్నాడు. పవర్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతున్న ఈ సినిమాలో బోయపాటి స్టైల్ ఆఫ్ యాక్షన్ భారీస్థాయిలోనే ఉంటుందట. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కైరా అద్వానీ కథానాయికగా వివేక్ ఒబెరాయ్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు.