‘సంత’ ఫస్ట్‌లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్య భరత్ చంద్ర, శ్రావ్యారావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై జైవర్థన్ బోయనపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘సంత’. మట్టిమనుషుల ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్శకుడు. ఓ సంత నేపథ్యంలో ప్రేమకథగా ఫీల్‌గుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ- గ్రామీణ నేపథ్యంలో ఓ చక్కని ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా తీసిన ‘సంత’ ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. గోరెటి వెంకన్న ఓ లెజెండ్. ఆయన ఈ సినిమాలో రాసిన పాట ఓ అద్భుతం. ‘సంత’ సక్సెస్ కావాలని చిత్ర యూనిట్‌కు విషెస్ తెలిపారు. దర్శకుడు ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ- సంత చిత్రీకరణ పూర్తయింది. పాటల చిత్రీకరణ చేశాం. సుకుమార్ మా చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది అన్నారు. త్వరలోనే పాటలను విడుదల చేస్తామన్నారు.