మే11న ‘మెహబూబా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్ నిర్మించిన చిత్రం ‘మెహబూబా’. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్‌కి చక్కటి స్పందన వస్తోంది. పరిశ్రమలోను, అటు ప్రేక్షకుల్లోనూ ‘మెహబూబా’ చిత్రంపై హై రేంజ్‌లో అంచనాలు నెలకొని వున్నాయి. అందరి అంచనాలకు రీచ్ అయ్యే విధంగా పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా చూసిన దిల్‌రాజు ‘ఎక్స్‌ట్రార్డినరీగా వుంది... ఇది పూరి సినిమా అంటే’ అని యూనిట్‌ని అప్రిషియేట్ చేయడం పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యింది. పూరి సంగీత్ ద్వారా ఈ చిత్రంలోని పాటలు విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘2002లో ఇడియట్‌తో పూరి జగన్నాథ్‌గారితో అసోసియేట్ అయ్యాను. అప్పుడు నేను నథింగ్. పవన్‌కళ్యాణ్‌గారితో ‘బద్రి’, మహేష్‌బాబుతో ‘పోకిరి’, ప్రభాస్‌తో ‘బుజ్జిగాడు’, ఎన్టీఆర్‌తో ‘టెంపర్’, రామ్‌చరణ్‌తో ‘చిరుత’, బన్నితో ‘దేశముదురు’, రవితేజతో ‘ఇడియట్’ సినిమాలు తీసి సూపర్‌హిట్స్ కొట్టాడు జగన్. తన హీరోలకి సెపరేట్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసి సినిమాలు చేస్తారు. టాప్ స్టార్స్ అందరితో సినిమాలు చేసి సక్సెస్‌లు సాధించారు. జగన్ మ్యాజిక్ మళ్లీ ‘మెహబూబా’తో రిపీట్ అవుతుంది.