ఓ.. సహజ నటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటిగా దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహానటి సావిత్రి జీవిత కథతో ‘మహానటి’ పేరుతో చిత్రం రూపొందుతోంది. కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. నాగ అశ్విన్ దర్శకత్వంలో స్వప్న సినిమా పతాకంపై ప్రియాంకా దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళంలో రూపొందుతోంది. సావిత్రిని పోలిన రూపంతో కీర్తిసురేష్ ఫస్ట్‌లుక్‌లోనే అదరగొట్టింది. ఫస్ట్‌లుక్ చూసినవారంతా మళ్లీ సావిత్రి పుట్టిందా అన్నంత ఆసక్తితో తిలకించారు. హావభావాలు, రూపం అచ్చంగా మహానటిని పోలి వున్నాయి. తెలుగు చలనచిత్ర చరిత్రోనే కాదు, దక్షిణాదిలో కూడా సావిత్రి అంటే ఓ ఎనలేని గౌరవం. నటనకు జీవం పోస్తూ సహజ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సావిత్రి అంటే అభిమానులకు అంతులేని ప్రేమ. కీర్తి సురేష్‌తోపాటు విజయ్ దేవరకొండ, సమంత, దుల్కర్ సల్మాన్, మోహన్‌బాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ఇది నాకు అత్యంత సంతోషకరమైన క్షణం. సావిత్రి నటన, కీర్తి ఏమిటో ఈ చిత్రంలో చూడొచ్చని చెప్పారు. మే 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.