పోస్ట్ ప్రొడక్షన్‌లో ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పి.వి.పి. సినిమా పతాకంపై నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన తారాగణంగా వంశీ పైడిపల్లి దర్శక్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఊపిరి’. దీనికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న సందర్భంగా నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి మాట్లాడుతూ, మ్యూజికల్ హిట్‌గా రూపొందిన ఈ చిత్రంలో ప్రతి పాటా అందర్నీ ఆకట్టుకుంటుందని తెలిపారు. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. విభిన్న దృక్పథాలున్న ఇద్దరి మధ్య స్నేహబంధం ఎలా ఏర్పడింది? అది చివరి వరకూ ఎలా సాగింది? అన్న కథనంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని, గోపీసుందర్ అందించిన బాణీలు అందరికీ నచ్చుతాయని దర్శకుడు వంశీ పైడిపల్లి అన్నారు. జయసుధ, ప్రకాష్‌రాజ్, కల్పన, అలీ, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, పాటలు: సిరివెనె్నల, రామజోగయ్యశాస్ర్తీ, కెమెరా: పి.ఎస్.వినోద్, ఎడిటింగ్: మధు, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.