పెళ్లిసందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించి, భిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంది సోనమ్‌కపూర్. ప్రముఖ నటుడు అనీల్‌కపూర్ కూతురైన సోనమ్, కెరీర్ పరంగా తనకు నచ్చిన సినిమాల్లోనే నటిస్తూ క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా గ్లామర్‌తోపాటు నటిగా ఇమేజ్ సంపాదించుకున్న ఈ అందాల భామ పెళ్లికి సిద్ధమైంది. గత కొంతకాలంగా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆనంద్ అహూజాతో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీరి ప్రేమ పెళ్లికి వరకూ వచ్చింది. మే మొదటివారంలో వీరు ఒక్కటి కాబోతున్నారు. ప్రస్తుతం ముంబైలోని సోనమ్ నివాసంలో పెళ్లి ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్ వేడుక కోసం ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ నేతృత్వంలో రిహార్సల్స్ జరుగుతున్నాయి.