రికార్డింగ్ మొదలెట్టారు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫిలింసిటీలో వేసిన సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. రాయలసీమ నేపథ్యంలో సినిమా వుంటుందని సమాచారం. దాంతోపాటు మంగళవారం థమన్ ఆధ్వర్యంలో రికార్డింగ్ పనులు మొదలుపెట్టారు. హారికా హాసిని బ్యానర్‌పై చిన్నబాబు నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మేకోవర్ కూడా కొత్తగా వుంటుందని, ఇటీవలే విడుదల చేసిన స్టిల్‌తో కన్‌ఫర్మ్ చేశారు. అజ్ఞాతవాసి తరువాత త్రివిక్రమ్ ఈ సినిమా కోసం పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడని, పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని తెలిసింది. ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ దాబు రత్నాని ఎన్టీఆర్‌కు సంబంధించిన ఫొటో షూట్ కూడా నిర్వహించారు. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.