త్వరలో వజ్రాలవేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిరణ్, సుమి, గిడ్డేష్, సమీర ప్రధాన తారాగణంగా కె.ఎస్.ఎల్. ఫిలిమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శేఖర్‌చంద్ర దర్శకత్వంలో కరె శ్రీనివాస్ అందిస్తున్న చిత్రం ‘వజ్రాలవేట’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తికావస్తోంది. మాస్ అడ్వెంచరస్ హారర్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మహానంది, నంద్యాల, గాజులపల్లె, ఓర్వకల్లు, కర్నూలులలో చిత్రీకరణ చేశామని, నిర్మాత శ్రీనివాస్ తెలిపారు. 70 మంది పై ఛేజింగ్ ఎపిసోడ్ డబుల్ కెమెరాతో చిత్రీకరించామని, అది ఈ చిత్రంలో హైలెట్‌గా నిలుస్తుందని ఆయన అన్నారు. ఒకేసారి వేల కోట్లు సంపాదిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఈ చిత్రంలో హీరోహీరోయిన్లకు, విలన్లకు కలుగుతుందని, వాటిని సాధించడానికి అడవిలోకి వెళ్లిన వారు వారికి ఎదురైన పరిణామాలే ఈ సినిమా కథాంశమని దర్శకుడు శేఖర్‌చంద్ర తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. వినోద్‌కుమార్, శివసత్యనారాయణ, హుస్సేన్, మహేశ్వరాచారి, నందిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బి.వి.రావు, నిర్మాత: కరె శ్రీనివాసులు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేఖర్‌చంద్ర.