స్పేస్ సినిమా మొదలైంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస విజయాలతో జోరుమీదున్న వరుణ్‌తేజ్ మరో సినిమాను మొదలుపెట్టాడు. ఘాజి చిత్రంతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వరుణ్‌తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, అతిథి రావు హైదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, క్రిష్, సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సంకల్ప్‌రెడ్డి తండ్రి సహదేవ్ వీర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేయగా, నాగేంద్రబాబు క్లాప్ కొట్టారు. దర్శకుడు క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. వరుణ్‌తేజ్ వ్యోమగామిగా నటిస్తున్న ఈ చిత్రం సైంటిఫిక్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ఈ సినిమాకు ఇప్పటికే భారీ సెట్టింగ్‌లను నిర్మించారు. విఎఫ్‌ఎక్స్ కీలక పాత్ర పోషించే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి కెమెరా: జ్ఞానశేఖర్ వి.ఎస్., ఎడిటింగ్:కార్తీక శ్రీనివాస్, సంగీతం:ప్రశాంత్ ఆర్.విహారి, నిర్మాతలు:రాజీవ్ రెడ్డి, సాయిబాబు, దర్శకత్వం:సంకల్ప్‌రెడ్డి.