సినిమా అంతా గుంటూరు చుట్టూనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అంతా గుంటూరులోనే జరుగుతుంది. ఓ రకంగా కలలా ఉంటుంది. ఓ అంశం ప్రేక్షకులకు కన్‌ఫ్యూజన్‌గాకూడా ఉంటుంది. ఇదంతా సినిమాటిక్‌గానే ప్రేక్షకుల్ని ఆహ్లాదపరుస్తుంది. అందుకే గుంటూర్ టాకీస్ అనే పేరును పెట్టాం అని సినిమా కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ తెలిపారు. ఆర్.కె.స్టూడియోస్ పతాకంపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఎం.రాజ్‌కుమార్ రూపొందిస్తున్న ‘గుంటూర్ టాకీస్’ చిత్రంలో సిద్ధు కథానాయకుడిగా నటించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 4న విడుదలకు సిద్ధమైంది. రేష్మీగౌతమ్ కథానాయికగా నటించిన ఈ చిత్రం గురించి సిద్ధు పలు విశేషాలను తెలిపారు.
* చిన్నప్పటినుండి సినిమాలు చేయాలన్న ఆలోచన లేదు. అలా అనుకోకుండా జరిగిపోయింది. అమ్మ ఆలిండియా రేడియోలో ఉద్యోగం చేసేవారు. చిన్నప్పుడు సంగీతం మీద మక్కువ ఉండేది. ఐదు సంవత్సరాలుపాటు తబలాలో శిక్షణ తీసుకున్నాను.
*‘్భమిలి కబడ్డి జట్టు’ షూటింగ్ జరిగేప్పుడు స్నేహితుడిని కలవడానికి వెళ్లాను. అక్కడ దర్శకుడు నన్ను చూసి ఆడిషన్ చేశారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఓ పాత్రకు ఎంపిక చేశారు. ఆ తర్వాత ‘ఆరెంజ్’ సినిమాలో చేశాను. అలా సినిమాల్లోకి వచ్చాను. ఆస్కార్ రవిచంద్రన్ రూపొందించిన ‘వలినమ్’ సినిమాలో కూడా నటించా.
* కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా కథను చాలా సింపుల్‌గా తయారుచేశాం. తొలి సినిమా ఎల్‌బిడబ్ల్యూలో ప్రవీణ్ సత్తారుతో చేసిన అనుభవం వుంది. అసలీ చిత్రానికి మొదట ‘గుంటూర్ టాకీస్’ అన్న పేరు లేదు. మాస్‌కు నచ్చే చిత్రం చేయాలని అనుకొని ఈ కథను తీసుకున్నాం. ప్రవీణ్‌సత్తారు కథలు రియలిస్టిక్‌గా ఉంటాయని చెప్పడానికి ఈ సినిమా కూడా ఓ ఉదాహరణగా నిలుస్తుంది.
* నాతోపాటు మరో పాత్ర ఉంటుంది. ఇద్దరం దొంగలం. ఒక సన్నివేశంలో ఆ దొంగలిద్దరూ ఎలా తమ జీవితాల్లో మార్పును ఆహ్వానించారు అనేదే ప్రధాన అంశం. మురికివాడల్లో వుండే హరి అనే ప్లేబాయ్ పాత్రలో కనిపిస్తా. అక్కడ వుండే ప్రతి అమ్మాయితో అఫైర్ పెట్టుకోవాలని కోరిక ఉంటుంది. గిరి అనే మరో స్నేహితుడితో దొంగతనాలు చేస్తూ వుండే పాత్ర ఇది.
* ఈ సినిమాకోసం ఓ పాట కూడా పాడా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశా. కొన్ని మాటలు రాశా. చెప్పాలంటే నా నటన హైలెట్‌గా సాగేందుకు అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నా.
* సినిమాకు సెన్సార్‌బోర్డు ఏ సర్ట్ఫికెట్ ఇచ్చింది. కానీ ఎవరైనా ఈ చిత్రాన్ని చూడచ్చు. రొమాంటిక్‌గా ఉంటుంది కానీ ఎక్కడా వల్గర్‌గా కనబడదు. తర్వాతి చిత్రాల గురించి ఇప్పుడే ఏం అనుకోవడంలేదు.

-యు