శృతి డ్రామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో ‘కాటమరాయుడు, హిందీలో- బెహెన్ హోగీ తెరీ’ చిత్రాల్లో కనిపించిన శ్రుతి ఆ తరువాత చాలారోజులుగా ఏ సినిమాలో నటించలేదు. దానికి కారణాలు ఏవైనప్పటికీ తాజాగా మరో బాలీవుడ్ చిత్రానికి సంతకం చేశారు. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో శ్రుతి నటించబోతున్నారు. ఇందులో శ్రుతికి జోడీగా విద్యుత్ జమ్వాల్ నటించనున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ముంబయిలో సినిమా చిత్రీకరణ ఈరోజే మొదలైంది. విజయ్ గలానీ, ప్రతీక్ గలానీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మరోపక్క తన తండ్రి కమల్‌హాసన్ దర్శకత్వంలో వస్తున్న ‘శెభాష్‌నాయుడు’ చిత్రంలోనూ శ్రుతి నటించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినప్పటికీ ఇంకా విడుదలకు నోచుకోలేదు.
శ్రుతి ఇన్నాళ్లూ సినిమాలను ఒప్పుకోకపోవడానికి కారణం తన ప్రియుడు మైఖేల్ కోర్సెల్‌తో వివాహం నిశ్చయమవడమేనని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.