మోదీపై సినిమా తీయాలనుకున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాల్లో ఉన్న నేను ప్రధాని మోదీగురించి ప్రజలకు అంతగా తెలీని విషయాలతో ఓ సినిమా తీయాలనుకు న్నా. ఈలోగా ‘టెర్రర్’ సినిమాకోసం పనిచేయాల్సి వచ్చింది’ అన్నారు ఆ చిత్ర నిర్మాత షేక్‌మస్తాన్. ‘సమాజానికి మనం ఏమి ఇచ్చాం అనేది ముఖ్యం కాదు. సమాజానికి మనం ఏం చేశాం అనేదే ముఖ్యం అని ఆలోచిస్తానని, ‘టెర్రర్’ చిత్రంతో అలా సంఘానికి ఉపయోగపడే విధంగా సందేశాన్ని అందించానని ఆయన అన్నారు. ప్రేక్షకులకు నచ్చి, సినిమాను అద్భుతంగా ఆదరిస్తున్నందుకు ఆనందంగా వుందని అన్నారు. శ్రీకాంత్, నిఖిత జంటగా అఖం డ భారత క్రియేషన్స్ పతాకంపై సతీష్‌కాశెట్టి దర్శకత్వంలో షేక్‌మస్తాన్ రూపొందించిన చిత్రం టెర్రర్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక విషయాలు తెలిపారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
‘సినిమాల్లోకి రాకముందు ఆరా అనే ఏజెన్సీ ప్రారంభించి, ప్రజలకు సేవ చేస్తున్నామని, రాజకీయాల్లో ఉండడంవల్ల ప్రధాని నరేంద్రమోదీతో కొంతకాలం ప్రయాణం చేసే అవకాశం లభించింది. ఆయన గురించి ప్రజలకు తెలియని కొన్ని విషయాలను తెలపాలనే ఉద్దేశంతో ఓ సినిమా చేయాలనుకుంటున్నా. దర్శకుడు కాశెట్టిని కలిసి విషయం చెప్పాను. ఆయన 35 కోట్లు దాకా ఖర్చవుతుందని చెప్పారు. ఆ తర్వాత ‘టెర్రర్’ సినిమా చేద్దామని అనుకొని, కథ నచ్చడంతో ముందుకు వెళ్లాం. సినిమా పరిశ్రమ గురించి నాకు పెద్దగా ఏం తెలియదు. కానీ హీరో శ్రీకాంత్ సహాయ సహకారాలు మరువలేనివి. హీరో శ్రీకాంత్‌పై పూర్తి భరోసా పెట్టడంతో ఈ సినిమా గురించి అంతా ఆయనే చూసుకున్నారు. ఆయన్ను కలిసినప్పుడు ఉన్న అభిప్రాయం ఇప్పుడు మారిపోయింది. బాధ్యతగా పనిచేసి ఈ సినిమాకోసం కష్టపడ్డారు. ఈ సినిమా విడుదలయ్యాక వస్తున్న రెస్పాన్స్ అందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది.
నేను తీయబోయే తదుపరి చిత్రాల్లో కూడా శ్రీకాంత్‌నే కథానాయకుడిగా తీసుకుంటా. మా సంస్థలో ఏడాదికొక సినిమా చొప్పున నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. కిరణ్ అనే కొత్త దర్శకుడు ఓ మంచి కథ చెప్పారు. త్వరలోనే ఆ సినిమాను ప్రారంభిస్తాం. 2018లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆధారంగా శ్రీకాంత్ కథానాయకుడుగా ఓ చిత్రాన్ని చేయనున్నాము అని ముగించారు.
-శ్రీ