సహచరుడు పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది, ఆశే్లష జంటగా ప్రభాకర్ యిప్ప దర్శకత్వంలో వెరీగుడ్ సినీ స్కూల్ బ్యానర్‌పై రవికుమార్ గంజి నిర్మించిన ‘సహచరుడు’ చిత్రంలోని పాటలు సోమవారం హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- చిన్న సినిమాలు విజయం సాధిస్తే పెద్ద సినిమాలు అవుతాయి. దర్శకుడు ప్రభాకర్ మంచి టాలెంట్ వున్న వ్యక్తి. ట్రైలర్ చూస్తుంటే అద్భుతంగా తెరకెక్కించాడని అర్థమవుతుంది. ప్రస్తుతం పరిశ్రమకు కొత్త టాలెంట్ రావాలి. అలాంటి కొత్తవారికి మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. తప్పకుండా ఈ సినిమా మంచి విజయం సాధించాలి అన్నారు. దర్శకుడు ప్రభాకర్ మాట్లాడుతూ- 8 సంవత్సరాల కష్టమే ఈ చిత్రం. ఒక్క సినిమావల్ల ప్రేక్షకుడు చెడిపోకూడదు అనేదే నా ఉద్దేశ్యం. ప్రతీ ఒక్కరి హృదయాన్ని కదిలించే సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. సాయి శ్రీనివాస్ మంచి సంగీతాన్ని అందించాడు. తప్పకుండా అందరికీ మా సహచరుడు నచ్చుతాడు అన్నారు. హీరో ఆది మాట్లాడుతూ- ఈ సినిమాలో పాత్ర కోసం బరువు పెరగమన్నారు. అదెందుకో సినిమా చేశాక అర్థమైంది. నన్ను హీరోగా నిలబెట్టే చిత్రమిది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రవికుమార్, రామారావు, ఆశే్లష తదితరులు పాల్గొన్నారు.