మనసుపెట్టి చేసిన సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాష్ పూరి, నేహా జంటగా ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ స్వీయ దర్శకత్వంలో పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘మెహబూబా’. ఈ చిత్రంలోని రెండో పాటను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో ఆకాష్ మాట్లాడుతూ- టైటిల్ సాంగ్ ఇప్పటికే విడుదలై మంచి సంచలనం రేపింది. అనూహ్యమైన స్పందన వస్తోంది. తాజాగా రెండో పాటను విడుదల చేస్తున్నాం. సందీప్ చౌతా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమాలో నాన్న హీరోగా అవకాశం ఇచ్చాడు. నిజానికి ఈ కథతో ఇండియాలో వున్న ఏ స్టార్‌తో అయినా సినిమా చేయొచ్చు. కానీ ఇంత మంచి అవకాశం నాకే ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్ చెబుతున్నా. అలాగే నాన్నకు ఇది కమ్‌బ్యాక్ ఫిలిం అవుతుంది అన్నారు. హీరోయిన్ నేహ మాట్లాడుతూ- ఇంత మంచి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవ్వడం ఆనందంగా వుంది. అవకాశమిచ్చిన పూరి జగన్నాధ్, ఛార్మికి థాంక్స్ అన్నారు. ఛార్మి మాట్లాడుతూ- పాటలు వింటుంటే అద్భుతంగా అన్పిస్తున్నాయి. భాస్కరభట్ల గొప్ప లిరిక్స్ అందించారు. సందీప్ చౌతా మ్యూజిక్ సూపర్‌హిట్‌గా నిలుస్తుంది. ఈ సినిమాకోసం యూనిట్ అందరూ ఎంతో కష్టపడ్డారు. వారందరికీ నా థాంక్స్. ముఖ్యంగా హీరో హీరోయిన్లు చాలా కష్టపడ్డారు. ఇంత మంచి సినిమాకు పనిచేసినందుకు ఆనందంగా ఉంది అన్నారు. పూరి జగన్నాధ్ మాట్లాడుతూ- ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు తీశాను. కానీ మనసుపెట్టి చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో ఆకాష్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. వాడికి చిన్నప్పటినుంచే హీరో అవ్వాలని కోరిక. ప్రతీ సినిమా సమయంలో నాకు అవకాశం ఇవ్వమని వెంటపడేవాడు. అలా చిరుతలో పరిచయం చేశాను. ఈ సినిమాను చూసిన దిల్‌రాజు అభినందించడం ఆనందంగా ఉంది. నిజంగా నీవు మనసుపెట్టి చేస్తే ఇలా వుంటుంది అని చెప్పారు. ఆయన ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పుడు నా వయసు 50, మరో పదేళ్లలో ఆకాష్ కంటే ఎక్కువ సినిమాలే చేస్తా అన్నారు.