సుకుమార్‌తో మరోసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం భరత్ అనే నేను సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్న మహేష్‌బాబు, తన సినిమాల విషయంలో వేగం పెంచాడు. ఇప్పటికే ఆయన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లితో కమిట్ అయిన విషయం తెలిసిందే. ఏడాది క్రితమే ఈ సినిమాకు సన్నాహాలు జరిగాయి. మే నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన 26వ చిత్రాన్ని క్రేజీ దర్శకుడు సుకుమార్‌తో చేయడానికి సిద్ధమయ్యాడు. ఇటీవలే రామ్‌చరణ్‌తో రంగస్థలం లాంటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న సుకుమార్ తదుపరి చిత్రాన్ని కూడా మైత్రీ మూవీస్ నిర్మిస్తుండడం విశేషం. మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమాతో నిర్మాతలుగా మైత్రీ మూవీస్ ఎంట్రీ ఇచ్చింది. బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న మైత్రీ బ్యానర్‌లో మహేష్-సుకుమార్‌లు కలిసి చేసే ప్రాజెక్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదివరకే మహేష్‌తో సుకుమార్ తెరకెక్కించిన 1 నేనొక్కడినే చిత్రం మేకింగ్ పరంగా హాలీవుడ్ రేంజ్‌లో వుందంటూ ప్రశంసలు అయితే దక్కాయి కానీ కమర్షియల్‌గా ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. అయినా సరే సుకుమార్‌తో సినిమా చేయడానికి అప్పుడే మహేష్ ఆసక్తి చూపడం విశేషం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు వెలువడనున్నాయి.