ఈ మాయ పేరేమిటో..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముప్ఫై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతోమంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన సీనియర్ ఫైట్‌మాస్టర్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా వి.ఎస్ క్రియేటివ్ వర్క్స్ బేనర్‌పై రూపొందుతున్న చిత్రానికి రాము కొప్పు దర్శకుడు, దివ్య విజయ్ నిర్మాత. లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘ఈ మాయ పేరేమిటో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో టైటిల్‌ను రివీల్ చేయడమే కాకుండా సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను, ఓ పాటను ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ- దర్శకుడు రాము సినిమాను బ్యూటీఫుల్‌గా తీశారు. సినిమా లవ్, అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది అన్నారు. ఫైట్‌మాస్టర్ విజయ్ మాట్లాడుతూ- నాకు ఎంతో ఆదరణ ఇచ్చిన ఇండస్ట్రీలోకి మా అబ్బాయిని హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతగా మా అమ్మాయి దివ్య విజయ్‌ను పరిచయం చేస్తున్నాను. దర్శకుడు రాము కొప్పుల కథను అద్భుతంగా తెరకెక్కించారు. నన్ను ఆదరించిన తరహాలోనే మా అబ్బాయిని, అమ్మాయిని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. దర్శకుడు రాము కొప్పుల మాట్లాడుతూ- మంచి లవ్, కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమా ఇది. చిత్రీకరణ అంతా పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాహుల్ విజయ్ సూపర్బ్ పెర్‌ఫామెన్స్, మణిశర్మ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్, శ్యామ్‌కె నాయుడు ఫొటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ సినిమాకు మేజర్ ప్లస్ అవుతాయి. సినిమా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుంది అన్నారు. నిర్మాత దివ్యా విజయ్ మాట్లాడుతూ- సినిమాను అనుకున్న ప్లానింగ్‌లో పూర్తిచేశాం. రాహుల్ విజయ్, కావ్యా థాపర్ జంట తెరపై చక్కగా వుంటుంది. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో ప్రేక్షకులముందుకు తీసుకొస్తాం అన్నారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, రాళ్లపల్లి, ఈశ్వరీరావు, పవిత్రా లోకేష్, సత్యం రాజేశ్, జోష్ రవి, కాదంబరి కిరణ్ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు.