క్రేజీ ఛాన్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుల్లితెరపై ఎంతగానో అలరిస్తున్న హాట్ యాంకర్స్ వెండి తెరపై కూడా మంచి నటనతో ఆకట్టుకుంటున్నారు. గత కొంతకాలంగా జబర్దస్త్ షోలో కొనసాగుతోన్న హాట్ యాంకర్ అనసూయ ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ షోద్వారా అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో మంచి ఆఫర్స్‌ను అందుకుంటూ సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపిస్తోంది. క్షణం సినిమాలో క్లిక్ అయిన ఈ బ్యూటీ రంగస్థలం సినిమాతో మరింత క్రేజ్ అందుకుంది. రామ్‌చరణ్‌కు అత్తగా కనిపించి అన్నివర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ఇప్పుడు మరికొన్ని సినిమాల్లోకూడా అనసూయకు ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ఈమె మాత్రం తనకు నచ్చిన క్యారెక్టర్స్‌ని మాత్రమే ఓకే చేస్తోంది. అనసూయ రీసెంట్‌గా ఒక మంచి ప్రాజెక్ట్‌లో అవకాశాన్ని అందుకుంది. విక్టరీ వెంకటేష్, వరుణ్‌తేజ్ హీరోగా ఎఫ్2 అనే మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఆ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌లో ఒక క్యారెక్టర్ చేస్తారా అని అడగ్గానే అనసూయ ఏమాత్రం నో చెప్పకుండా ఓకే చేసిందట. సినిమాలో కీలకమైన పాత్రే అని తెలుస్తోంది.