సుమా రంగనాథన్ ‘దండుపాళ్యం-4’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు బోల్డ్ బ్యూటీగా పేరొందిన సుమా రంగనాథన్ (సుమన్ రంగనాథన్) ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూనే వున్నారు. ఆమె నటించిన ‘మైనా, ‘నీర్ దోసే’ చిత్రాలు ఇటీవల విశేషాదరణ పొందాయి. కన్నడ నాట తన తడాఖా చూపిస్తోన్న ఈమె ‘దండుపాళ్యం-4’లోనూ విలక్షణమైన పాత్రను పోషించారు. ఈ చిత్రానికి దండుపాళ్యం ట్రయాలజీకి ఎలాంటి సంబంధం లేదు. ఈ దండుపాళ్యం-4లో జైలులో వున్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ దండుపాళ్యం-4 రూపొందింది. ఇందులో ఏడుమంది గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు. ఈ చిత్రం ఇప్పటికి 30 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈ చిత్ర కథ కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిందని సుమా రంగనాథన్ చెప్పారు. 40 మంది గ్యాంగ్‌లో ఎనిమిదిమంది జైలులో ఉంటారు. వారిని తప్పించడానికి సాగే పథక రచనతోనే ఈ సినిమా రూపొందిందని ఆమె వివరించారు. ఈ చిత్రంలో నటిస్తున్నంత సేపు ఎంతో ఎంజాయ్ చేశానని సుమా రంగనాథన్ చెబుతున్నారు. కథలో వైవిధ్యం తనకెంతగానో నచ్చాయని, వేడి పుట్టిస్తున్న వేసవిలోనూ సెట్స్‌లో ఎంతో ఎంజాయ్ చేస్తూ నటించానని ఆమె అన్నారు. ఒకప్పుడు హాట్‌గాళ్‌గా తెలుగువారిని సైతం పలు చిత్రాల్లో అలరించిన సుమా రంగనాథన్, తరువాత కన్నడ, తమిళ చిత్రాలకే పరిమితమయ్యారు. ఆ తరువాత చాలా రోజులు తెరపై కనిపించలేదు. ఈమధ్య తనకు ఎంతో ఇష్టమైన సైకాలజీలో డిప్లొమా చేశారు. ఈ చిత్రం పూర్తికాగానే మరిన్ని కోర్సులు చేయాలని ఉంది, తప్పకుండా చేస్తాను అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు సుమా రంగనాథన్. కర్ణాటక, బెంగుళూరు, హుబ్లీ, బెల్గామ్, చిత్రదుర్గ ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ సాగుతోంది. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేయాలని దర్శక నిర్మాత కె.టి.నాయక్ ప్లాన్ చేశారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సంజీవ్, విఠల్, అరుణ్‌బచ్చన్, రిచాశాస్ర్తీ, బుల్లెట్ సోము, స్నేహ ఇతర ముఖ్యపాత్రధారులు. ఆనంద్ రాజా విక్రమ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా ఆర్.గిరిగా వ్యవహరిస్తున్నారు.