రామ్ చిత్రం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ హీరో రామ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కనున్న చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ- ఈరోజు ఈ చిత్రాన్ని నిరాడంబరంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాం. మే 7 నుంచి జార్జియాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఆ నెలాఖరువరకూ తొలి షెడ్యూల్ జరుగుతుంది. ఆ తరువాత కాశ్మీరు, లడఖ్ తదితర ప్రాంతాల్లో భారీ షెడ్యూల్స్‌ను జరపనున్నాం. సరికొత్త తరహాలో సాగే చిత్రమిది. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు మాట్లాడుతూ- రామ్‌కు చక్కగా సరిపోయే కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. యాక్షన్, అడ్వెంచరస్‌లతో తెరకెక్కే ఈ సినిమా న్యూ వేవ్‌లో సాగుతుంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు, నటీనటులు పనిచేస్తారు. అందరినీ మెప్పించే సినిమా అవుతుంది అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సమర్పణ: కృష్ణచైతన్య, నిర్మాత: స్రవంతి రవికిశోర్, దర్శకత్వం: ప్రవీణ్ సత్తారు.