హారర్ థ్రిల్లర్‌గా లాస్ట్ బస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడంలో విజయం సాధించిన ‘లాస్ట్ బస్’ చిత్రాన్ని తెలుగులో శ్రీమంజునాథ మూవీ మేకర్స్ సంస్థ అనువాదం చేస్తోంది. అవినాష్ నరసింహరాజు, మేఘశ్రీ భాగవతార్, ప్రకాష్‌బేలవాడి, ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్.డి.అరవింద్ రూపొందించారు. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ, ఈ సినిమా గురించి పలు విశేషాలు చెప్పవచ్చని, ఫ్రెంచి భాషలో డబ్బింగ్ అవుతున్న చిత్రంగా రికార్డుకెక్కిందని, అలాగే బిబిసి, ఆసియా రేడియో నెట్‌వర్క్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఫీచర్‌ను చేశారని తెలిపారు. కన్నడంలో విజయం సాధించినట్లే తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయం సాధిస్తుందని, విడుదల తేదీ తదితర వివరాలు త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు. మానసాజోషి, దీపాగౌడ్, రాజేష్ పి, రాకాశంకర్, స్నేహనాగరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అనంత్, ఎడిటింగ్: శ్రీ క్రేజీ, రచన, సంగీతం, దర్శకత్వం: ఎస్.డి.అరవింద్.