సిద్ధమైన డార్లింగ్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళైయరసన్, రమీజ్‌రాజా, మాయ, కాళివెంకట్ ప్రధాన తారాగణంగా స్టూడియో గ్రీన్, కె.ఇ.జ్ఞానవేల్‌రాజా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తమిళ చిత్రం ‘డార్లింగ్-2’. ఈ చిత్రాన్ని ఎవర్‌గ్రీన్ క్రియేషన్స్ పతాకంపై మాధురి బొల్లు తెలుగులో అందిస్తున్నారు. సతీష్‌చంద్రశేఖరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసి, సెన్సార్‌కు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. దర్శకుడు అతని ఐదుగురు స్నేహితులు హాలీడేలో జరిగిన సంఘటనను ఆధారం చేసుకొని, ఈ చిత్రాన్ని రూపొందించారని, సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. హరి, అర్జునన్, రామ్‌దాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రథన్, మాటలు: రాజశేఖరరెడ్డి, పాటలు: శివగణేష్, కెమెరా: విజయ్ కార్తిక్ కణ్ణన్, నిర్మాత: మాధురి బొల్లు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సతీష్‌చంద్రశేఖరన్.