బిగ్‌బాస్-2 కోసం కమల్ వస్తున్నాడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ హోస్ట్‌గా మొదలుపెట్టిన బిగ్‌బాస్ రియాలిటీ షో సూపర్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో రెండో సీజన్ చేయడానికి సన్నాహాలు జోరందుకున్నాయి. అయితే ఈ రెండో సీజన్ విషయంలో ఎన్టీఆర్ నో చెప్పడంతో ఆయన ప్లేస్‌లోకి నానిని దింపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకా హోస్ట్ విషయంలో కన్ఫ్‌ర్మ్ కాలేదు కాబట్టి తెలుగులో మొదలయ్యేందుకు కాస్త టైం పట్టేలా వుంది. కానీ తమిళంలో అయితే వెంటనే మొదలుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే షో అటు తమిళంలో కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. జాతీయ నటుడు కమల్‌హాసన్ హోస్ట్‌గా క్రేజ్ తెచ్చుకున్న ఈ రెండో సీజన్‌కు ఆయన ఓకె చెప్పడంతో వెంటనే ఆ షోలు మొదలుపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూన్ 25 నుండి అక్కడ బిగ్‌బాస్ రెండో సీజన్ మొదలు కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే రాజకీయ పార్టీని స్థాపించిన కమల్‌హాసన్ మళ్లీ టీవీ షో చేయడం ఆసక్తిగా నిలిచింది. ఒకవేళ కమల్‌హాసన్ నో చెబితే ఆయన ప్లేస్‌లోకి హీరో సూర్యని తెచ్చే ప్రయత్నాలు జరిగాయి. కానీ కమల్‌హాసన్ ఓకె చెప్పడంతో వెంటనే షో మొదలుపెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.