సీమ నేపథ్యంలో మహేష్ సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా భరత్ అనే నేను సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు తన తదుపరి చిత్రం విషయంలో బిజీగా మారాడు. వంశీ పైడిపల్లి రూపొందించే ఈ సినిమా ఎక్కువ భాగం అమెరికాలో షూటింగ్ జరుగుతుందట. అయితే సినిమా మాత్రం రాయలసీమ నేపథ్యంలో కథ సాగుతుందని టాక్. ఇప్పటికే వంశీ పైడిపల్లి అమెరికాలో పలు లొకేషన్స్ అనే్వషణలో ఉన్నాడు. ఊపిరి సినిమా తరువాత మహేష్ కోసం దాదాపు ఏడాదిన్నరకుపైగా వెయిట్ చేశాడు వంశీ. మహేష్‌బాబు కెరీర్‌లో ఇంతవరకు టచ్ చేయని రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో మహేష్ ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే వారంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. మరి మహేష్ బాబు ఫ్యాక్షనిజం చేస్తే ఎలా వుంటుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మహేష్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత ఆయన సుకుమార్‌తో సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే.