మెహబూబా అందరికీ నచ్చేస్తుంది -- దిల్‌రాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై నేహాశెట్టి హీరోయిన్‌గా శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి కనెక్ట్స్ నిర్మించిన చిత్రం ‘మెహబూబా’. 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధ నేపథ్యంలో జరిగే లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ అధినేత దిల్‌రాజు మే 11న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్‌కి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో యూత్‌కి చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా.. దిల్ రాజు మాట్లాడుతూ- ఈనెల 11న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. సినిమా మీద నమ్మకంతో ముందు కాలేజీ యూత్‌కి ప్రదర్శించాం. సినిమా జనాల్లోకి వెళ్లడం చాలా కీలకం. కొత్తవాళ్లతో తెరకెక్కించిన సినిమా తప్పకుండా జనాల్లోకి వెళ్లాలి. పూరి మనసు పెట్టి స్క్రిప్ట్ రాస్తే ఎలా వుంటుందో మెహబూబా సినిమా చూస్తే తెలుస్తుంది. 1971 కథని 2018 కథతో అందంగా కనెక్ట్ చేశారు. జెన్యూన్ లవ్‌స్టోరీ ఇది. డబుల్ పాజిటివ్ చూసినపుడే సినిమా మీద నమ్మకం కుదిరింది. మామూలుగా పూరి స్టైల్‌లో ఒక సెటైర్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలాంటిదేమీ ఉండదు అని చెప్పారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ- సినిమా నచ్చడంతో దిల్‌రాజు యువతకు ప్రదర్శించమని చెప్పేశారు. నిజంగానే జెన్యూన్‌గానే చేశాను. సీన్లు, డైలాగులు బావున్నాయి. ఇడియట్, పోకిరి తర్వాత మా ఇద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఆడియెన్స్ ఒక చోట నవ్వుతారని నేననుకుంటే, వాళ్లు నాలుగు చోట్ల నవ్వుతున్నారు. ఇది నాకు స్పెషల్ థ్రిల్‌ని కలిగించింది అని అన్నారు. ఛార్మి మాట్లాడుతూ- టీజర్ విడుదలైనప్పటినుంచి మా సినిమాకు చాలా మంచి స్పందన వస్తోంది. యుఎస్‌లో ఈ సినిమాను ప్రిమియర్ వేస్తున్నాం అన్నారు.