థాంక్యూ ఇండియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ హీరోగా శ్రీరామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై వక్కంతం వంశీ దర్శకత్వంలో లగడపాటి శిరీషా శ్రీ్ధర్ రూపొందించిన చిత్రం ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’. ఈ నెల 4న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా థాంక్స్‌టు ఇండియా మీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు వక్కంతం వంశీ మాట్లాడుతూ- ‘‘ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ రావడం చాలా ఆనందదాయకం. నాకు తొలి సినిమా అవకాశం, ఇలాంటి పెద్ద సినిమా రూపంలో రావడం చాలా సంతోషం. కంటెంట్‌ని కమర్షియల్‌గా కూడా చెప్పొచ్చని నేను అన్న మాట నమ్మి నాతో అల్లు అర్జున్ ప్రయాణం చేశారు. సినిమా ఇంత రిచ్‌గా రావడానికి నిర్మాతలు చాలా సహకరించారు. నా టీమ్ అందరికీ ధన్యవాదాలు. ఇంత మంచి కంటెంట్‌తో ఉన్న ఈ సినిమాను మనస్ఫూర్తిగా గుండెల్లోకి తీసుకున్న వారందరికీ ధన్యవాదాలు. మలయాళం, తమిళ్, తెలుగులో సినిమా చాలా బాగా ఆడుతోంది’’ అని చెప్పారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ- ‘‘నా పేరు అల్లు అర్జున్. నా ఇల్లు ఇండియా. ఈ ఫంక్షన్ పేరు థాంక్యూ ఇండియా. అందులో తొలి థాంక్యూ మా పవన్‌కళ్యాణ్‌గారికి. పవర్ స్టార్ అభిమానులకు. నాకు ఆర్మీలాగా నిలుచునే అభిమానులకి. ఈ సినిమా గురించి నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్‌లో ఒకటి మీతో పంచుకుంటాను. ‘సినిమాను చూశాం. చాలా బావుంది ఈ సినిమా. మా పిల్లలు మిలిటరీ యూనిఫార్మ్ కుట్టించుకోవాలనుకుంటున్నారు. సినిమా పూర్తయ్యాక దాన్ని చూశాక పిల్లలు ఎవరైనా హెయిల్ స్టైల్స్, బ్యాగ్‌లు కావాలని అడుగుతారు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత పిల్లలు మిలిటరీ కాస్ట్యూమ్స్ కుట్టించుకుంటున్నారు’ అని చాలామంది తల్లులు, మహిళలు నాతో చెప్పారు. అది విని చాలా ఆనందించాను’’ అని చెప్పారు. పవన్‌కళ్యాణ్ మాట్లడుతూ ‘‘నా పేరు సూర్య సినిమాను చూడాలనే కోరిక నాకు కలిగింది. లగడపాటి శ్రీ్ధర్‌గారిని అడిగి ఒకసారి ఈ సినిమా చూసి మిగిలిన పర్యటనలకు వెళ్తాను. వక్కంతం వంశీగారు నేను ‘కొమరం పులి’ చేసేటప్పుడు ఓ కథ చెప్పారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాను. ఆయన ఇవాళ అల్లు అర్జున్‌గారి లాంటి పెద్ద హీరోతో సినిమా చేశారు. లగడపాటి శ్రీ్ధర్, నేను ఒకేచోట ఉండేవాళ్లం. ఆయనకు ధన్యవాదాలు. మా అన్నయ్య నాగబాబుగారు దీనికి ఒక ప్రొడ్యూసర్ అని కూడా తెలియదు. సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నట్టు నాకు చెప్పడు. మేం ఎక్కువగా మాట్లాడుకోం కాబట్టి నాకు తెలియదు. అల్లు అర్జున్‌గారు నటించిన ‘బన్నీ’ తర్వాత ‘ఆర్య’ సినిమా నాకు నచ్చింది. ఆ తర్వాత ‘దేశముదురు’ వంటి సినిమాలతో ఆయన ఎదిగారు. అల్లుఅర్జున్‌గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. ఆయన చేసిన సినిమాలన్నీ గొప్ప విజయం సాధించాలి. వాళ్ల తల్లిదండ్రులకు, వారి తాతగారికి, మిగిలిన వాళ్లందరికీ మంచి పేరు తెచ్చి పెట్టాలి. మంచి సినిమా లగడపాటి శ్రీ్ధర్, వక్కంతం వంశీ, అల్లు అర్జన్‌గారి ద్వారా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగబాబు, మెహర్ రమేశ్, రామజోగయ్యశాస్ర్తీ, బన్నీ వాసు తదితరులు పాల్గొన్నారు.