మనిషికి తోడుగా ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలీవుడ్‌లో ‘ఇన్‌టచ్‌బుల్స్’ చిత్రాన్ని తెలుగులో ఎవరైనా చేస్తే బావుంటుందని అనుకున్నాం. అందులో నేను నటించాలని కూడా అనుకున్నాను. మనసులో గట్టిగా కోరుకుంటే జరుగుతుందన్నట్లుగా దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని చేయడానికి రావడంతో ఒప్పుకున్నాను అని నాగార్జున తెలిపారు. పి.వి.పి. సినిమా పతాకంపై నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన తారాగణంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఊపిరి’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని పరమ్ వి.పొట్లూరి రూపొందించారు. హైదరాబాద్‌లో జరిగిన ఆడియో విడుదల కార్యక్రమంలో బిగ్ సీడీని అక్కినేని అమల, ఆడియో సీడీని నాగార్జున విడుదల చేశారు. ఇంకా చిత్ర విశేషాలు తెలుపుతూ నాగార్జున ఇలా అన్నారు.
ఈ సినిమాలో తాను కాళ్లు చేతులు పడిపోయినా మనసు పరిగెత్తే ఓ పాత్రలో నటించానని, అన్ని ఎలిమెంట్స్‌తోపాటుగా సినిమాలో మనిషికి తోడు ఎంత అవసరమో ఈ సినిమా చెబుతుందని, ‘శివ’, ‘గీతాంజలి’, ‘అన్నమయ్య’ చిత్రాలకు వచ్చినంత పేరు ఈ చిత్రానికీ వస్తుందన్నారు. నాగార్జున ఈ చిత్రంలో నటిస్తున్నారు అంటేనే వెంటనే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నానని, మనకు తగిన విధంగానే దర్శకుడు ఈ సినిమాని మార్పులు చేర్పులు చేశారని, అన్ని డిఫరెంట్‌గానే ఉంటాయని నటుడు కార్తి తెలిపారు. ఈ సినిమాకు నాగార్జున ఒక ఊపిరి అయితే కార్తి మరొక ఊపిరి అని, గోపీసుందర్ మంచి సంగీతాన్ని అందించారని దర్శకుడు వంశీ పైడిపల్లి తెలిపారు. కార్యక్రమంలో గోపీసుందర్, కె.రాఘవేంద్రరావు, ప్రకాష్‌రాజ్, జయసుధ, కాజల్ అగర్వాల్, రామజోగయ్యశాస్ర్తీ, సుమంత్, కళ్యాణకృష్ణ, అడవి శేషు తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.