కథలు నచ్చితేనే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామగా ఇమేజ్ తెచ్చుకున్న ప్రణీత ఎప్పుడైతే పవన్‌కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమాలో నటించిందో..ఆ సినిమా తరువాత వరుస అవకాశాలతో క్రేజీ మీదున్న ఈ అమ్మడికి ఆ తరువాత చేసిన సినిమాలు వరుస పరాజయాలు అందుకోవడంతో అవకాశాలు తగ్గాయి. దాంతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తమిళంలో రెండు, కన్నడంలో రెండు సినిమాలు చేసిన ఈ భామ తెలుగులో ఎందుకు సినిమాలు చేయడం లేదని అడిగితే ఏమందో తెలుసా.. తెలుగులో సినిమాలు చేయకపోవడానికి కారణం మంచి కథలు రాకపోవడమేనట. మంచి కథలు వస్తేనే సినిమాలు చేస్తానని ఏది పడితే అది చేయనని చెప్పింది. అందుకే తెలుగులో గ్యాప్ వచ్చిందని చెప్పిన ఈ బ్యూటీకి తెలుగులో రామ్ సరసన ‘హలో గురు ప్రేమకోసమేరా జీవితం’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ పాత్ర తన మనసుకు దగ్గరగా ఉందని చెప్పింది. గ్లామర్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడికి మరిన్ని తెలుగు అవకాశాలు రావాలని కోరుకుందాం.