మెగాస్టార్ కోసం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనీ ఏ దర్శకుడు అనుకోడు చెప్పండి. పైగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మెగాస్టార్ ఖైదీ నంబర్ 150తో ఎంట్రీ ఇచ్చి బాక్స్‌ఆఫీస్ వద్ద దుమారం రేపి తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసాడు. అందుకే ఆయనతో సినిమాలకు పలువురు దర్శకులు సన్నాహాల మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా క్రేజీ దర్శకుడు కొరటాల శివ కూడా ఆయనతో సినిమా చేయడానికి సిద్ధం అయినట్టు తెలుస్తోంది. లేటెస్ట్‌గా మహేష్‌బాబుతో ఆయన చేసిన భరత్ అనే నేను సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా తరువాత కొరటాల కోసం పలువురు స్టార్ హీరోలు ఎదురుచూస్తున్నారు. అయితే కొరటాల ఫోకస్ మాత్రం మెగాస్టార్‌పై పడిందట. ఆయనకోసం ఓ కథను సిద్ధంచేసే పనిలో ఉన్నాడట. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రం ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తయింది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలోనే మొదలుకానుంది. ఈ సినిమా తరువాత మెగాస్టార్ తదుపరి చిత్రం ఎవరితో అన్న ఆసక్తి ఏర్పడింది. అయితే ఇప్పటికే బోయపాటి శ్రీను క్యూలో ఉన్నాడు. మరోవైపు బోయపాటి శ్రీను కూడా మెగాస్టార్‌తో సినిమాకు రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో కొరటాల సినిమానే ముందు సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.