హిట్ ఖాయమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ క్రేజీ భామ శ్రుతిహాసన్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఈ మధ్య వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న ఈ భామ లేటెస్ట్‌గా తెలుగు ‘ప్రేమమ్’ చిత్రంలో నటిస్తోంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మలయాళ సూపర్‌హిట్ ‘ప్రేమమ్’ సినిమాకు రీమేక్. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. అందులో టీచర్ పాత్రలో గ్లామర్ భామ శ్రుతిహాసన్ నటిస్తోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఆమె నటించాల్సిన భాగం షూటింగ్ పూర్తయ్యింది. ఇటీవలే ఆమెపై ఓ పాట కూడా చిత్రీకరించి మిగిలిన టాకీ కూడా పూర్తిచేసారు. ఈ సినిమాలో శృతి పాత్రకు మరింత క్రేజ్ దక్కుతుందని యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. మొత్తానికి ఈ సినిమాకు తన కెరీర్‌లో మరో హిట్ పడుతుందన్న ధీమాతో శ్రుతి ఉంది. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.