శ్రీకాంత్ అడ్డాలతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తబంగారులోకం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ‘సీతమ్మ వాకిట్లో..’ చిత్రంతో క్రేజీ దర్శకుడిగా మారాడు. ఆ సినిమా తరువాత మహేష్‌తో బ్రహ్మోత్సవం చేసి భారీ పరాజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తరువాత ఆయనకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ప్రయత్నాలు సాగిస్తున్న ఈ దర్శకుడికి ఓ యువ హీరో అవకాశం ఇచ్చాడట. దాంతో స్క్రిప్ట్ విషయంలో సీరియస్‌గా వర్క్ చేస్తున్నట్లు తెలిసింది. శ్రీకాంత్ అడ్డాలకు ఓకె చెప్పిన ఆ హీరో ఎవరో కాదు శర్వానంద్. కూల్‌గా విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న శర్వానంద్‌కు శ్రీకాంత్ ఓ కథ చెప్పాడని, కథ నచ్చడంతో శర్వా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడట. దాంతో ఈ సినిమాతో ప్రయత్నాలు మొదలయ్యాయి. అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుందని, ఈ చిత్రం శర్వాతోపాటు మరో హీరో కూడా నటిస్తాడట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు వెలువడే అవకాశం ఉంది.