బ్యాంకాక్ షూటింగ్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాజాగా రంగస్థలం సంచలన విజయంతో జోరుమీదున్న రామ్‌చరణ్, తన తదుపరి చిత్రానికి వేగం పెంచాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. రెండో షెడ్యూల్‌ను ఈనెల 12 నుంచి బ్యాంకాక్‌లో జరుపుతున్నారు. ఈనెల 25 వరకు అక్కడే షూటింగ్ జరగనున్నదని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలిసింది. చరణ్-బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో తెరకెక్కే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా సంచలనం సృష్టిస్తోంది. రామ్‌చరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తరువాతి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డి.వి.వి బ్యానర్‌పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.