జోరుగా సాహో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం సాహో. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం గత కొన్ని రోజులుగా దుబాయ్‌లోని అబూదబిలోని పలు లొకేషన్‌లలో షూటింగ్ జరుపుకుంటోంది. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ నేతృత్వంలో పలు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దాంతోపాటు భారీ ఛేజ్ కూడా చిత్రీకరించారట. ఈ షెడ్యూల్‌లో పలువురు హిందీ నటులతోపాటు తమిళ నటుడు అరుణ్ విజయ్ కూడా పాల్గొంటున్నాడట. శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి శంకర్-ఎహసాన్- లాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న ఈ చిత్రాన్ని యు.వి క్రియేషన్స్ 100 కోట్లకుపైగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోందట.