మరిన్ని మంచి పాత్రలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలనటిగా చిత్రసీమలో అడుగుపెట్టి 40 చిత్రాలకుపైగా నటించి కన్నడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రమోదిని. తాజాగా తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ పలు చిత్రాల్లో మంచి పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని స్వంతం చేసుకుంటోంది. నిర్మలా కానె్వంట్, ధృవ, లై, కిరాక్ పార్టీ, నా పేరు సూర్య వంటి చిత్రాల్లో నటించిన ఈమె, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘మెహబూబా’లో హీరో తల్లి పాత్రలో మెప్పించారు. ఈ సందర్భంగా ప్రమోదిని స్పందిస్తూ- కన్నడంలో బాలనటిగా పరిచయమై 40కిపైగా చిత్రాలు చేశాను. తవ్వారుమణి చిత్రంతో బాలనటిగా కెరీర్ మొదలుపెట్టిన నేను ఎన్నో అవార్డులు అందుకున్నాను. ఆ తరువాత ఉదయ టీవీలో యాంకర్‌గా పనిచేశాను. అలాగే కన్నడంలో టీవీ సీరియల్స్ కూడా చేశాను. తెలుగులో మనోయజ్ఞం సీరియల్‌తో నా కెరీర్ ప్రారంభమైంది. ఆ తరువాత పెళ్లిచేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యాను. ఐదేళ్లు గడిచాక సినిమాల్లో నటించాలన్న ఆసక్తి పెరిగింది. అందుకే హైదరాబాద్ వచ్చేశాను. కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన నాకు లై, ధృవ, కిరాక్ పార్టీ, నాపేరు సూర్య లాంటి చిత్రాల్లో మంచి పాత్రలు దక్కాయి. ప్రస్తుతం పూరి తెరకెక్కించిన మెహబూబాలో ఆకాష్ తల్లిగా చాలా బాగా చేశావని అంటున్నారు. నేను పూరి జగన్నాధ్‌కు రుణపడి ఉంటాను. అలాగే నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రస్తుతం రాజ్‌తరుణ్ నటిస్తున్న రాజుగాడు, రాహుల్ రవీంద్రన్ దృష్టి, రథం, హుషారు చిత్రాల్లో మంచి పాత్రలు చేస్తున్నాను. నటిగా నన్ను నిరూపించుకునే మరిన్ని మంచి పాత్రలు చేయాలని వుంది అని చెప్పారు.