మెహబూబా విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై రూపొందిన చిత్రం ‘మెహబూబా’. ఈ చిత్రానికి సందీప్‌చౌతా సంగీతం అందిస్తున్నారు. 1971 ఇండియా-పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కింది. మే 11న ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన థాంక్స్ మీట్‌లో.. ఛార్మి మాట్లాడుతూ.. ‘్థయేటర్స్‌ను విజిట్ చేస్తున్నాం. ప్రేక్షకులనుండి సూపర్బ్ రెస్పాన్స్ వస్తుంది. మా సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్. ఇలాంటి మెహబూబాను థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌లో చూస్తే బావుంటుంది. ప్రతి ఒక్కరూ సినిమా చూసి మాకు ఇంకా మీ సపోర్ట్ అందించాలని కోరుతున్నాం’ అన్నారు. నేహాశెట్టి మాట్లాడుతూ... ‘మా సినిమాను ప్రేమించి ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్. ఆకాశ్ సూపర్బ్ కోస్టార్. పూరిగారు బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ రాసి.. ఎంతో కేర్‌తో అద్భుతంగా తెరకెక్కించారు అన్నారు. ఆకాశ్ పూరి మాట్లాడుతూ.. ‘సినిమా చూసిన అందరూ సినిమా బావుందని అప్రిషియేట్ చేస్తున్నారు. కెమెరావర్క్, మ్యూజిక్, ఎడిటింగ్ సహా ప్రతి ఒక్కరూ హార్డ్‌వర్క్ చేశారు. నేహా బాగాచేయడం వల్లనే నేను బాగా కష్టపడ్డాను. మంచి క్యారెక్టర్ ఇచ్చి నాతో సినిమా చేసిన నాన్నకు థాంక్స్. ఓ యాక్టర్‌గా నాకు నిలిచిపోయే సినిమా. నెక్స్ట్ సినిమానుండి బాగా కష్టపడి ఇంకా మంచి సినిమాలు చేస్తానని నాన్నకు ప్రామిస్ చేస్తున్నాను’ అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘అమెరికాలో తెలుగు వాళ్ళతో కలిసి సినిమా చూశాను. అక్కడ అందరికీ బాగా నచ్చింది. ఇన్‌టెన్స్ లవ్‌స్టోరీ చేశానని అందరూ మెచ్చుకున్నారు. మ్యూజిక్, ప్రొడక్షన్ వేల్యూస్ గురించి, ఆకాశ్ బాగా చేశాడని మెచ్చుకున్నారు. నేను రెగ్యులర్‌గా చేసే దానికి భిన్నంగాచేసిన సినిమా ఇది. క్లీన్ లవ్‌స్టోరీ. ఫ్యామిలీతో అందరూ కలిసి చూసే లవ్‌స్టోరీ. నా కెరీర్‌లో నేను బాగాఇష్టపడి మనసుపెట్టి చేసిన సినిమా ఇది. అలాగే బాలయ్యగారికి హ్యాట్సాఫ్. ఫ్రెండ్‌షిప్‌కు వేల్యూ ఇచ్చి ముందునుండి సినిమాకు సపోర్ట్‌చేస్తూనే ఉన్నారు. జై బాలయ్య అన్నారు.