బంగార్రాజు మళ్లీ వస్తాడట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగార్రాజుగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నాగార్జున ఆ పాత్రపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన చిత్రం సంచలన విజయం సాధించడంతోపాటు బంగార్రాజు పాత్ర జనాల్లోకి బాగా వెళ్లింది. ఈ విజయంతో దానికి సీక్వెల్ రూపొందించే సన్నాహాలు చేశారు కానీ వేరే సినిమాల కమిట్‌మెంట్‌లతో అపుడు కుదరలేదు. తాజాగా ఆ సినిమాకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రవితేజతో నేల టికెట్ చిత్రాన్ని రూపొందిస్తున్న కళ్యాణ్‌కృష్ణ ఈ సినిమా తరువాత నాగార్జునతో బంగార్రాజు తెరకెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలోనే నాగార్జునతో ఓకె చెప్పించే పనిలో పడ్డాడు. మరోవైపు నాగార్జున కూడా ఆఫీసర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. అన్నీ కుదిరితే బంగార్రాజు చిత్రం జూన్ చివరిలో సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.