హిమాలయాలలో గూఢచారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటుడిగానే కాకుండా రచయితగా కూడా తన సత్తా చాటుకున్న అడివి శేష్ హీరోగా నటిస్తున్న యాక్షన్ డ్రామా చిత్రం ‘గూఢచారి’. ఈ చిత్రానికి సంబంధించి చివరి షెడ్యూల్‌గా ఓ భారీ యాక్షన్ సన్నివేశాలను హిమాచల్‌ప్రదేశ్‌లోని హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రవహించే ఓ మహానదిపై నిర్మించిన ఎత్తయిన మిలిటరీ వంతెనపై చిత్రీకరిస్తున్నారు. అడివి శేష్‌తోపాటు ప్రకాష్‌రాజ్, ఇతర నటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. ‘గూఢచారి’ అమెరికాలోని వౌంట్ రైనియర్‌తో పాటు ఇతర అందమైన లొకేషన్‌లలో చిత్రీకరించారు. న్యూఢిల్లీ, పూణే, చిట్టగాంగ్, హైదరాబాద్, వైజాగ్, కాకినాడలలో సముద్రం మధ్యలో మంచు పర్వత ప్రాంతాలలో షూటింగ్ చేసారు. స్పైథ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంతో శశికిరణ్ తిక్క దర్శకునిగా పరిచయమవుతున్నారు. అడివి శేష్ కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఉన్నత సాంకేతిక విలువలతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శోభిత ధూళిపాళ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంతో సుప్రియ యార్లగడ్డ మళ్లీ తెలుగుతెరపై కనిపించనున్నారు. ఈ చిత్రానికి కథ: అడివిశేష్, నిర్మాత: అభిషేక్ నమ, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సహ నిర్మాత: వివేక్ కూచిబొట్ల, సంగీతం: శ్రీచరణ్ పాకాల, మాటలు: అబ్బూరి రవి, ఛాయాగ్రాహకులు: షానిల్ డియో, ఎడిటర్: గ్యారీ బి.హెచ్., ప్రొడక్షన్ డిజైన్: శివమ్‌రావు, దర్శకత్వం: శశికిరణ్ తిక్క.