మాస్‌రాజా నేల టిక్కెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్ రాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడీ వుంటుంది. యాక్షన్ ఉంటుంది. వెటకారపు డైలాగులు ఉంటాయి. మంచి ఎమోషన్లు ఉంటాయి. కుటుంబం మొత్తం సరదాగా కలిసి చూసే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి. ఇక కళ్యాణ్‌కృష్ణ తీసింది రెండు సినిమాలే అయినా తనకంటూ ఒక క్లాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. మంచి కథా కథనంతో సరదాగా సాగిపోతూ ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా పండించే సినిమాలు తీసిన ఆయన ఇప్పుడు రవితేజతో నేల టికెట్టు తీస్తున్నారు. మరి ఒక మాస్ హీరో ఒక క్లాస్ దర్శకుడు కలిసి పనిచేస్తే ఎలా వుంటుంది? చాలా ఆసక్తి రేపిన ఈ ప్రశ్నకి నిన్న విడుదల చేసిన సినిమా ట్రైలర్ సమాధానం చెప్పేసింది. ఫస్ట్ టైం లైఫ్‌లో అమ్మ, అక్క, చెల్లి కాకుండా ఒక కొత్త రిలేషన్ కనిపిస్తుంది’, ‘చుట్టూ జనం మధ్యలో మనం.. అది కదరా లైఫ్’, ‘ముసలితనం అంటే చేతకానితనం కాదురా.. నిలువెత్తు అనుభవం’ లాంటి ఈలలు వేయించే రవితేజ మార్క్ మాస్ డైలాగులు చూస్తుంటేనే అర్థం అయిపోతుంది ఈ సినిమా క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ ప్రతి ఒక్కరినీ దృష్టిలో పెట్టుకుని తీశారని. మే 25న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. రవితేజ సరసన మాళవికా శర్మ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.