ఈ ఆట కొత్తగా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుశాంత్ కథానాయకుడుగా శ్రీ నాగ్ కార్పొరేషన్, శ్రీ జి ఫిలిమ్స్ పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల రూపొందిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం..రా’ (జస్ట్ చిల్). ఈ సినిమాకు సంబంధించిన టాకీ, యాక్షన్ పార్ట్‌లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ, కథ సరికొత్తగా ఉంటుందని, తనకు ఈ పాత్ర కూడా కొత్తగా ఉందని, దర్శకుడు ఎంటర్‌టైన్‌మెంట్ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారని తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగిన విధంగా సాగే ఈ చిత్రంలో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కంట తడిపెట్టిస్తాయని ఆయన అన్నారు. ఫ్యామిలీ, యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్ర కథ సుశాంత్‌కు 100 శాతం అతనికి సరిపోయే విధంగా ఉంటుందని, కామెడీ సినిమాలో హైలెట్‌గా ఉంటుందని దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి తెలిపారు. ముఖ్యమైన కామెడీ సన్నివేశాలకోసం భారీ సెట్ వేశామని, పాటల చిత్రీకరణ తర్వాత సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. సోనమ్‌ప్రీత్ బజ్వా, బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని, వెనె్నల కిషోర్, రఘుబాబు, పృథ్వి, ఫిరోజ్ అబ్బాస్, సుధ, ఆనంద్, రమాప్రభ, రజిత, హరీష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: దాశరథి సివేంద్ర, ఎడిటింగ్: గౌతంరాజ్, కథ, మాటలు: శ్రీ్ధర్ సీపాన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.