వినోదాత్మకంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్, శాలు చౌరశియా, మమతా చౌదరి, జెబా అస్రమ్ నాయకానాయికలుగా నటిస్తున్న ‘పెళ్ళంటే’...? చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో తరుణ్ క్లాప్‌నివ్వగా, రాజేంద్రకుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ‘మా’అధ్యక్షుడు శివాజీరాజా గౌరవ దర్శకత్వం వహించారు. ఏంజెల్ ప్రొడక్షన్స్, మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్ బ్యానర్స్‌పై అలీ భాయ్ నిర్మిస్తున్నారు. మోయిన్‌ఖాన్ మెహ్మద్ దర్శకత్వం వహిస్తున్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘చాలాకాలం తర్వాత కుటుంబ కథాచిత్రంలో నటిస్తున్నా. నాకు పక్కాగా యాప్ట్ అయిన సబ్జెక్ట్ ఇది. అలీ కథ బాగుంది చేయి! అని డైరెక్టర్‌ను నా దగ్గరకు పంపించాడు. కథ వినగానే వెంటనే ఓకే చేసా. మంచి ఎంటర్‌టైనర్, నవరసాలు కథలో ఉన్నాయి. మోయిన్ చాలా సినిమాలకు రైటర్‌గా పనిచేసారు. ఆ అనుభవంతో కథను బాగా రాసుకున్నాడు. సినిమా కూడా బాగా తీస్తారని నమ్మకం ఉంది’అని అన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ.. ‘మోయిన్ చాలాకాలం నుంచి తెలుసు. మంచి సినిమాలకు రైటర్‌గా పనిచేసాడు. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ సినిమాకు ఆయన రైటర్ అని అన్నారు. దర్శకుడు మోయిన్‌ఖాన్ మాట్లాడుతూ.. ‘కథ ఆరంభంనుంచి చివరివరకూ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ‘పెళ్లిసందడి’, ‘పెళ్లాం ఊరెళితే’ తరహాలో సాగే కథ. సినిమా అంతా సందడి సందడిగా హాయిగా సాగిపోతుంది. కొన్ని సన్నివేశాలు కన్నీళ్లను పెట్టిస్తాయి. చాలాకాలం తర్వాత శ్రీకాంత్‌గారిని ఇలాంటి కథలో చూపిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తాం. షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతుంది’అని అన్నారు. నిర్మాత అలీభాయ్ మాట్లాడుతూ.. ‘మంచి కథ. చక్కని నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. థియేటర్లో సినిమా చూస్తున్నంతసేపు నవ్వులు పువ్వులే. జూన్‌నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. అన్ని పనులు పూర్తిచేసి వీలైనంత త్వరగా సినిమా రిలీజ్ చేస్తాం’అని అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జి.కె, సంగీతం: మోయిన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఒలీఖాన్, స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్: ఏంజెల్ ప్రొడక్షన్స్.