ఒక్క రోజులో జరిగే కథకళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్ కథానాయకుడుగా పాండ్యరాజ్ దర్శకత్వంలో విశాల్ ఫిలిమ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందించిన చిత్రం ‘కథకళి’. ఈ సినిమాను తెలుగులో శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ, తమిళంలో పెద్ద విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా అందరికీ నచ్చుతుందని, ఒక హత్య నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందిందని తెలిపారు. ఒక్కరోజులో జరిగే కథాకథనంతో స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా సాగుతూ ప్రేక్షకులకు థ్రిల్ కలుగుతుందని తెలిపారు. మధుసూదన్ విలన్‌గా అద్భుతంగా నటించారని, తెలుగు నేటివిటీకి తగిన విధంగా వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఉంటుందన్నారు. గౌరీకృష్ణ మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని తెలుగులో ఈనెల 18న రెండు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నామని, విశాల్ కెరీర్‌లోనే వైవిధ్యంగా రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని అన్నారు. ఔట్ అండ్ ఔట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా విజువల్స్ హైలెట్‌గా ఉంటాయని నటి కేథరిన్ తెలిపారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తన స్నేహితుడి జీవితంలో జరిగిన యధార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందించామని, అనుకోని పరిస్థితుల్లో జరిగిన మర్డర్‌ను ఎవరు చేశారు అనే ఆసక్తికర కథనంతో మొదటినుండి చివరి వరకు సస్పెన్స్‌గా సాగే జోనర్‌లో రూపొందించామని దర్శకుడు పాండ్యరాజ్ తెలిపారు. విశాల్ నటన సినిమాకు హైలెట్‌గా ఉంటుందని, తమిళం లాగ తెలుగులో కూడా ఖచ్చితంగా హిట్ అవుతుందన్న నమ్మకంవుందని ఆయన అన్నారు. నాజర్, కరుణాస్, సూరి, శ్రీజిత్వ్రి, పవన్, మైమ్ గోపి, మధుసూధన్‌రావు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బాలసుబ్రహ్మణ్యం, సంగీతం: హిప్‌హాప్ తమిళ, మాటలు: శశాంక్ వెనె్నలకంటి, పాటలు: భువనచంద్ర, వెనె్నలకంటి, సమర్పణ: శ్రీ కృష్ణ క్రియేషన్స్, నిర్మాత: విశాల్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పాండ్యరాజ్.