రియాలిటీలో సాహో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహో.. ప్రస్తుతం తెలుగు, తమిళ ప్రేక్షకుల్ని ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం. బాహుబలి లాంటి సంచలన విజయం తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం దుబాయ్‌లోని అబూదభిలో పలు కీలక ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నిబెట్స్ ఆధ్వర్యంలో యాక్షన్, ఛేజింగ్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే ఇంటర్నేషనల్ మీడియా పలు కథనాలను ప్రచురించింది. దాంతో సినిమాపై భారీ హైప్ నెలకొంది. కేవలం దుబాయ్‌లోని షూటింగ్ కోసమే 90 కోట్ల రూపాయల ఖర్చుతో భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఇవ్వకుండా సహజంగానే ఉండేలా కెన్నీబెట్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. వాస్తవంగా వుంటేనే ప్రేక్షకులకు ఫీల్ కలుగుతుందని భావించి ఆ తరహా ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరెకెక్కిస్తున్నారు.