పోస్ట్ ప్రొడక్షన్‌లో టాక్సీవాలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్‌రెడ్డి చిత్రంతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరవకొండ నటిస్తున్న చిత్రం టాక్సీవాలా. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ టీజర్‌కి చాలా క్రిటికల్ అప్లాజ్ రావటం విశేషం. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్ శరవేగంగా జరుపుకుంటోంది. జూన్ రెండవ వారంలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. జిఏ2 పిక్చర్స్ మరియు యు.వి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్‌కెఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా.. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయవౌతున్నారు. అర్జున్‌రెడ్డి చిత్రం తర్వాత విజయ్‌దేవరకొండ పాపులారిటీ ఎలా పెరిగిందో తెలిసిందే. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా టాక్సీవాలా చిత్రం రూపుదిద్దుకుంటోంది. విజయ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోతుంది. జూన్ ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండియర్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.