హాలీవుడ్‌పై అనాసక్తి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య ఇండియన్ స్టార్స్‌కు హాలీవుడ్‌లో తారలుగా ఎదగాలనే ఆశలు కలుగుతున్నాయి. ఎప్పుడైతే బాలీవుడ్ భామలు ప్రియాంక చోప్రా.. దీపికా పదుకొనెలు అక్కడ క్రేజ్ తెచ్చుకున్నారో అప్పటినుండి పలువురు భామలు కూడా హాలీవుడ్ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇండియన్ స్టార్ అంటే అక్కడివాళ్లకు ఆసక్తి ఎక్కువ. అయితే అందరికీ భిన్నంగా తనకు హాలీవుడ్ సినిమాల్లో పనిచేయడం పెద్దగా ఇష్టం లేదని షాకిచ్చింది సొట్టబుగ్గల తాప్సీ? అదేంటి అందరు.. హాలీవుడ్.. హాలీవుడ్ అంటూ ఎగబడుతుంటే ఈమె ఇలా రివర్స్‌గా మాట్లాడుతుంది ఏమిటి? అని షాక్ అవుతున్నారా? మీరు విన్నది నిజమే.. ఈ అమ్మడికి హాలీవుడ్ సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేదని చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హాలీవుడ్‌లో అవకాశం వస్తే నటించేందుకు ఇష్టమే కానీ.. ఆ అవకాశం కోసం రకరకాల ప్రయత్నాలు చేయడం మాత్రం చేయనని అంటోంది. నాకు ఇక్కడ మంచి సినిమాలు ఉన్నాయి.. వాటిని కాదని హాలీవుడ్ సినిమాల్లో అవకాశాల కోసం ఎవరినో అడుక్కోవడం ఇష్టంలేదని చెప్పింది సొట్టబుగ్గల తాప్సీ.