శరవేగంగా అరకురోడ్డు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌శంకర్, నికిషాపటేల్ జంటగా వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, సురేష్‌వర్మ, ఇందుకూరి, నక్కా రామేశ్వరి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘అరకు రోడ్డులో’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా కథానాయకుడు రామ్‌శంకర్ మాట్లాడుతూ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా సాగే ఈ చిత్రానికి సంబంధించిన రెండో షెడ్యూల్ జరుపుతున్నామని అన్నారు. యాక్షన్ పార్ట్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఈ సినిమాలో ఉంటుందని, షూటింగ్ పూర్తిచేసి మే చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌కు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ లభిస్తోందని దర్శకుడు వాసుదేవ్ తెలిపారు. డిసెంబర్ 20న షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రాన్ని వైజాగ్, పాడేరు ప్రాంతాల్లో చిత్రీకరించామని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధవౌతామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాహుల్‌రాజ్, వాసుదేవ్, కెమెరా: శ్రీ జగదీష్ చీకటి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, రచన, దర్శకత్వం: వాసుదేవ్.