డ్రైవర్ రాముడు టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్వుల వీరుడు షకలక శంకర్ హీరోగా రాజ్ సత్య దర్శకత్వంలో సినిమా పీపుల్స్ పతాకంపై మాస్టర్ ప్రణవ్ తేజ్ సమర్పణలో వేణుగోపాల్ కొడుమగుళ్ల, ఎమ్.ఎల్ రాజు, ఆర్.ఎస్ కిషన్ నిర్మిస్తున్న చిత్రం ‘డ్రైవర్ రాముడు’. థర్డ్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఇటీవలే విడుదలైన మొదటి ప్రచార చిత్రం సినిమా అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పుడు సినిమాకు సంబంధించిన మొదటి టీజర్‌ను విడుదల చేసారు. సక్సెస్‌ఫుల్ హీరో సుధీర్‌బాబు డ్రైవర్‌రాముడు మొదటి టీజర్‌ను విడుదల చేసారు. తర్వాత సుధీర్‌బాబు మాట్లాడుతూ.. ‘‘కమెడియన్‌గా నచ్చిన నటుడు షకలక శంకర్. ఒక్క సినిమాలో షకలక శంకర్ కమెడియన్‌గా ఉన్నాడు అంటే ఆ చిత్రంలోని కామెడీ ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు తాను హీరోగా వస్తున్నాడు అంటే ఈ చిత్రంలో కామెడీ అద్భుతంగా ఉంటుంది అని అర్థం అయింది. ఈ డ్రైవర్ రాముడు చిత్రం టీజర్ నేను విడుదల చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిర్మాతలైన వేణుగోపాల్ కొడుగుమళ్ల, ఎమ్‌ఎల్‌రాజు, ఆర్‌ఎస్ కిషన్‌లకు, దర్శకుడు రాజ్‌సత్యకి నా శుభాకాంక్షలు. డ్రైవర్‌రాముడు సినిమా మంచి హిట్‌కావాలి అని కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్‌సత్య మాట్లాడుతూ.. ఇప్పటివరకూ తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన శంకర్‌లో మరో కొత్తకోణం ఈ చిత్రం ద్వారా చూపించబోతున్నాం. శంకర్ మార్క్ కామెడీ యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రకథ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. అవుట్‌పుట్ చాలాబాగా వచ్చింది. మా సినిమా టీజర్‌ను సుధీర్‌బాబుగారు విడుదల చేయటం మా అదృష్టం. సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘మా డ్రైవర్ రాముడు’ సినిమా టీజర్‌ని సుధీర్‌బాబుగారు విడుదల చేయటం మా అదృష్టం. వారు టీజర్‌ని చూసి చాలా బాగుంది. ఖచ్చితంగా హిట్ అవుతుంది అని కొనియాడారు.