విజేతగా కళ్యాణ్‌దేవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్ హీరోగా పరిచయమవుతున్న తొలి చిత్రానికి ‘విజేత’ టైటిల్ ఖరారుచేసారు. 1985లో చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా టైటిల్ ఇది. ఇప్పుడు అల్లుడు కూడా ఇదే టైటిల్‌తో ఇండస్ట్రీకి వస్తున్నాడు. లైటింగ్ ఆఫ్ స్మైల్స్ ఆన్ అదర్స్ ఫేసెస్ ఈజ్ ఆల్సో ఎ సక్సెస్ అనేది ట్యాగ్‌లైన్. అంటే ఇతరుల మొహాల్లో వెలుగు చూడటం కూడా విజయమే అని అర్థం. అందుకే కథకు తగ్గట్లుగా ఈ చిత్రానికి విజేత అనే టైటిల్ పెట్టారు. సాయి కొర్రపాటి వారాహి సంస్థలో రజినీ కొర్రపాటి నిర్మాతగా విజేత వస్తుంది. రాకేశ్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. మాళవిక నయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న హర్షవర్ధన్, రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు.