మల్టీ స్టారర్ కోసం..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ తెరకెక్కనున్న క్రేజీ మల్టీస్టారర్‌పై ఇప్పుడు అందరి దృష్టిపడింది. ఆర్‌ఆర్‌ఆర్ కాంబినేషన్‌లో సినిమా అంటూ వార్తలు వచ్చినప్పటినుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? అని సినీ జనాల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి లాంటి సంచలన విజయం తరువాత రాజవౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దానికితోడు మెగా ఫ్యామిలీ... నందమూరి ఫ్యామిలీ హీరోలు కలిసి నటిస్తుండడం కూడా మరో ఆసక్తికి కారణం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని... త్వరలోనే ఎన్టీఆర్- చరణ్‌లకు స్క్రిప్ట్ వినిపించేందుకు రెడీ అయ్యాడట మన జక్కన్న. ప్రస్తుతం రామ్‌చరణ్ బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉండగా, తారక్ త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో టైం చూసుకుని ఇద్దరి హీరోలకు స్క్రిప్ట్ వినిపించాలని ఫిక్స్ అయ్యాడట. డివివి దానయ్య నిర్మించే ఈ సినిమాకు సంబంధించిన పూర్తివివరాలు జూన్‌లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ క్రేజీ మల్టీ స్టారర్ ఎలా ఉంటుందో.. అన్న ఆసక్తి అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి.